ఇది కదా.. ఓటు యొక్క గొప్పతనం.!
సర్పంచ్'గా వేల్పుల రమేష్ విజయం..
నేటి కలం వార్త తెలంగాణ ; పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని అనుకొని ఉన్న పెద్దపల్లి మండల పరిధిలోని నిమ్మనపెల్లికి చెందిన గొడిసెల మమత నంబయ్య ఆ గ్రామపంచాయతీ పరిధిలోని రెండవ వార్డ్ మెంబర్గా గెలవడం అసాధారణంలో సుసాధారణం అయినట్టు కనిపిస్తుంది. వార్డ్ మెంబర్ పోటీలో ఎవరూ లేరు అనుకున్న తరుణంలో వేసిన నామినేషన్ ఎన్నికల బరిలో హోరాహోరిపోటికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వార్డ్ మెంబర్ గా నిల్చున్న గొడిసెల మమత నంబయ్య స్థానికులు కాదని తనకు ఓటు వేయదన్న ప్రచారమే ఎక్కువగా నడిచింది. అయినప్పటికీ తాను తన భర్త ఇచ్చిన స్పూర్తితో ముందుకు సాగారు. బతుకుదెరువు కోసమే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని కానీ తాను ఇప్పుడు గ్రామంలోని 2వ వార్డ్ మెంబర్గా ఓకే ఒక్క ఓటుతో గెలవడం జరిగిందని ఇకనుండి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నానని నేను ఎక్కడ ఉన్న మన ఈ ఊరి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కి తన వంతు కీలక పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా ఆవిడ అన్నారు. ఇకపై నుండి నా ఊరు నా ప్రజలే వార్డ్ అభివృద్దే ద్యేయమని వారికి ఎలాంటి అవసరం వచ్చిన ముందుండి పని చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వేల్పుల రమేష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ నేతలు పోటీ చేసినప్పటికీ తనను మాత్రమే సర్పంచ్ గా గెలిపించిన ఓటర్ మహాశయులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు ప్రజా శ్రేయస్సు పరమావధిగా పని చేస్తానని నేను చేసే పని పట్ల ఎలాంటి సొమ్మును ఆశించనని తన మన అనే తేడ లేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు బాధ్యతగా ముందుండి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇరువురి ప్రతినిధులకు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజ్ కుమార్, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్.హెచ్.ఆర్.సి) రాష్ట్ర నాయకులు ఇంజం సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి బాపురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోడిసెల నంబయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఎన్.హెచ్.ఆర్.సి సభ్యులు ఆరెపల్లి శ్రీదేవి, గద్దల అనిల్ కుమార్, వేముల రాజేంద్ర ప్రసాద్, పెరుక కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


1 కామెంట్‌లు
Congratulations 💐
రిప్లయితొలగించండి