వృద్ధురాలు పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

      తృటిలో తప్పిన పెను ప్రమాదం..

 ఆర్టీసీ బస్సులతో జరభద్రం.? అన్నట్టుగానే ఉందిగా.?

నేటి కలం తెలంగాణ వార్త : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో గల టెంపుల్ రోడ్ మసీదు చౌరస్తాలో ఒక వృద్ధురాలి పైకి ఆర్టీసీ బస్సు అతి వేగంగా దూసుకువచ్చింది. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు సుమారు 11:47 నిమిషాలకు సమయంలో పట్టణ కేంద్రంలో గల ఆర్టీసీ బస్ స్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు ఒక వృద్ధురాలు కూడా తన గమ్యం చేరుకోవడానికి అక్కడే వేచి చూస్తుంది. అంతలో అక్కడ ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోవడానికి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆ వృద్ధురాలి పై పైకి దూసుకు రావడంతో వృద్ధురాలు అదుపు తప్పి బస్సు కింద పడబోవుగా అక్కడ పక్కనే ఉన్న ఒక యువకుడు అప్రమత్తమై ఆ వృద్ధురాన్ని తన చేత్తో పట్టుకొని పక్కకి లాగి కాపాడాడు. బస్సు నెంబర్ ( TS-22-T-7179 ) గా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అనే మాట దేవుడెరుగు.! కానీ ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు జర భద్రం.? అనే భయాందోళన  ప్రజలలో ఏర్పడుతున్నట్టుగా.? తెలియవస్తుంది.

0 కామెంట్‌లు