తల్లి.. కొడుకు.. ఒకటే క్లాస్‌మేట్స్‌..

   క్లాస్ రూంలో రోషన్, తన తల్లి స్వర్ణలత...


నేటి కలం డిసెంబర్ 1 వార్త ;- ఓ తల్లి తన కొడుకు భవిష్యత్ కోసం ఓ మహాత్కరమైన నిర్ణయం తీసుకుంది. ఈ పైన చిత్రంలో కనిపిస్తున్న తల్లి తన కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం డిప్లమా కోర్సులో చేర్చిన ఆ తల్లి తానూ కూడా ఇంకా ఎందుకు చదువుకోవద్దు.. నేర్చుకోకూడదని ఆలోచించారు. ఇంకేముంది తాను కూడా అదే కాలేజీలో ప్రవేశం తీసుకుని తనయుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఎంతో అరుదుగా జరిగే స్ఫూర్తిదాయకమైన పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామం చెందిన 38 ఏళ్ల జక్కుల స్వర్ణలతకు ఇంటర్మీడియెట్‌ చదివే సమయంలో పెళ్లయింది. కూలి పని చేసే భర్త లక్ష్మణ్‌ ప్రోత్సాహంతో ఆమె దూర విద్యలో డిగ్రీ, పీజీ చదివారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రోషన్‌ను ఐటీఐలో ఏడాది కాలపరిమితి కలిగిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో చేర్చాలని నిర్ణయించారు. ఈ కోర్సు అభ్యసించేందుకు వయోపరిమితి 45 సంవత్సరాల వరకు ఉండటంతో సెప్టెంబరులో నిర్వహించిన స్పాట్‌ అడ్మిషన్‌లో కుమారుడితో కలిసి ఆమె సైతం ఐటీఐలో చేరారు. ఈ మహాత్కరమైన సంఘటన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వేదికైంది. అయితే తాను నేర్చుకోవడంతో పాటు కుమారుడిని ప్రోత్సహించేందుకు ఈ కోర్సులో చేరినట్లు స్వర్ణలత తెలిపారు. ఇద్దరు కలిసి రోజూ 15 కి.మీ. దూరంలోని పెద్దపల్లి ఐటీఐలో తరగతులకు హాజరవుతున్నారు.

1 కామెంట్‌లు