రామగుండం పెద్ద చెరువులో చేపల పై విష ప్రయోగమా.?

     విష ప్రయోగం  అడ్డుకున్న స్థానికులు..


తదుపరి అధికారుల చర్యలేంటో.?

నేటి కలం వార్త రామగుండం  : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఆబాది రామగుండం (విలేజ్ రామగుండం) పెద్ద చెరువుగా పేరుగాంచి ఎన్నో ఏళ్ల నుండి రామగుండం పంట పొలాలకు  సాగు నీటిని అందిస్తూ గత టి-బిఆర్ఎస్ ప్రభుత్వంలో  గంగపుత్రలకు ముదిరాజులకు ఆ నాటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన చేపల పెంపకంతో వారి జీవనోపాదికి ఎంతో సహకరిస్తుందని భావించి తెలంగాణ రాష్ట్రమంతట ఉన్న చెరువులలో పూడికలను తీసి ప్రభుత్వం నుండి చేపలను పంపిణీ చేసి వేలాది చేపలను అందులో వేశారు. అదే ప్రాతిపదికన రామగుండంలో కేంద్ర బిందువుగా ఉన్న పెద్ద చెరువులో కూడా వేస్తూ వచ్చారు. స్థానిక సంఘం నాయకులు చెబుతున్న వివరాల ప్రకారం గత ఏడాది కూడా పెద్ద చెరువులో చేపలను వేయగా అదే సంఘలోని ఒక వర్గానికి చెందిన ఓ వ్యక్తి చెరువుని తాత్కాలిక లీజు పై  తీసుకుని యధావిధిగా ప్రభుత్వం పంపిణీ చేసిన చేపలను చెరువులో వేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి సంఘం వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్థానికేతరుడు అయిన మరో వ్యక్తి కి లీజు కి ఇచ్చాడు. ఇక్కడ గమ్మత్తు ఐన విషయం ఏంటంటే ఆ మరో వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి కి లీజుకు ఇచ్చినట్టు సమాచారం.? కాగా మొదట తీసుకున్న అదే సంఘానికి చెందిన వ్యక్తి యొక్క లీజు సమయం గడువు పూర్తి కావస్తుండటంతో చివరగా లీజుకు తీసుకున్న వ్యక్తి కి సమాచారం అందించాడు. దింతో సదరు వ్యక్తి ఉన్న పలంగా చేపలు పట్టడానికి తెప్పలను.. చేపలు పట్టే జలరులను.. వాహనాల సహాయంతో రామగుండం పెద్ద చెరువు వద్దకు చేరుకొని వొలల సహాయంతో పట్టాల్సిన చేపలను అలా కాకుండా వాహనాలలో వారి వెంట తీసుకొని వచ్చిన నీళ్లలో వేస్తే పురుగులు.. క్రిమికీటకాలు.. బ్యాక్టేరియా.. వంటి వాటిని నాశనం చేసే (చంపే) బ్లీచింగ్ పౌడర్ తో పాటు చేపలు నీళ్లలో చనిపోయి అవి నీళ్లలో తెలియాడుతుంటే తర్వాత సులువుగా చేపలను పట్టుకోవాలనే (ఉ)దురుద్దేశంతో బ్లీచింగ్ పౌడర్ తో పాటు మరో విషపురితమైన రాసాయనాన్ని కూడా తీసుకువచ్చి పౌడర్ తో పాటు కలిపి పెద్ద చెరువు నీళ్లలో వేసే ప్రయత్నం చేయగా అటుగా వచ్చిన కొందరు యువకులు అడ్డుకుని గంగపుత్ర సంఘం వారికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్న సంఘం నాయకులు పెద్దపల్లి జిల్లా మత్స్యకార అధికారికి చరవాణి ద్వారా ఫిర్యాదు చేసి అటు పిదప స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీని పై విచారణ ఏ విధంగా ఉండబోతోందో.. ఏం  జరగబోతోందో..  మనం రేపటి వరకు వేచి చూడాలి.

0 కామెంట్‌లు