మత సామ్రస్యాన్ని చాటిన రామగుండం యువత
భాయ్ భాయ్.. కలిసికట్టుగా నవరాత్రి ఉత్సవాలు
నేటి కలం వార్త / పెద్దపల్లి : రామగుండం పట్టణంలోని స్థానిక ' ఏ ' పవర్ హౌస్ వద్ద ఓం యూత్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి హిందూ ముస్లిం మైనారిటీ సోదరులు కలిసి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం నాడు మహా గణపతికి హిందూ ముస్లిం సోదరులు కలిసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వారు కలిసికట్టుగా పాల్గొని భక్తులకు భోజనాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే హిందూ ముస్లిం అనే విభేదాలు లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అన్న నానుడిని చాటి చెబుతూ వారంతా కలిసి ప్రతి పండగని కలిసికట్టుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా మన భారతదేశమంతటా ప్రతి ఒక హిందూ ముస్లిం సోదరులు కూడా కలిసికట్టుగా ప్రతి పండుగను జరుపుకొని మతసామ్రస్యాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులతో పాటు హిందూ ముస్లిం మత పెద్దలు పలువురు ఓం యూత్ కమిటీ సభ్యులను అభినందిస్తూ ఘనంగా శాలువలతో సత్కరించి అభినందించారు.
1 కామెంట్లు
Super👏
రిప్లయితొలగించండి