జిల్లా అధ్యక్షుడి సాక్షిగా జరిగిన రగడ..?
రామగుండం పట్టణంలో ఉన్న రెండు బిజెపి జెండాలు
నేటి కలం రామగుండం వార్త ;- జాతీయ బిజెపి పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం శుధ్ధి చేయడానికి ముందు బిజెపి పార్టీ తలపెట్టిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జగడానికి దారి తీసింది. అయితే గతంలో అదే పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి ఒకానొక నాయకుడు అక్కడ ఇదివరకే నిర్మించిన జెండా ఉండడంతో ప్రస్తుతం బిజెపి పార్టీలో ఉన్న నాయకుడు అతి ఉత్సాహంతో ఆ నాయకుని అనుచరుడికి ఫోన్ చేసి అక్కడ ఇదివరకే ఉన్నటువంటి బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తామని దానికి అభ్యంతరం చెప్పవద్దని మాట్లాడగా సదరు నాయకులు కూడా మొదట సరేనని చెప్పి తదుపరి వద్దని చెప్పడంతో సదరు నాయకునికి బీజేపీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ అభ్యంతరం తెలిపి నిరాకరించి నూతనంగా నిర్మించిన జెండాని ఆవిష్కరించాల్సిందిగా సదరు నాయకునికి సర్ది చెప్పింది.
అంతలోనే అక్కడికి చేరుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుని సమక్షంలో జెండా ఆవిష్కరణ జరుగుతున్న క్రమంలో గతంలో బిజెపి పార్టీలో కొనసాగిన నాయకులు స్థానికంగా జెండా ఎగరేసే స్థలానికి చేరుకొని వాదనకు దిగడంతో కాసేపు అక్కడ జగడం జరిగింది. ఒక జాతీయ పార్టీ అందులోను దేశానికే ఎంత గొప్పగానో నూతన సంస్కరణలు చేపడుతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంంలో ముందుకు పోతున్న బిజెపి పార్టీలో కొందరి నాయకుల వల్ల పార్టీకి ప్రజాదరణ కోల్పోతుందని పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. బిజెపి అంటే క్రమ శిక్షణ గల పార్టీ అని పదే పదే చెప్పుకుంటున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ అది కనిపించకపోవడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రజాధరణ పొందుతున్న బిజెపి పార్టీ ఇకనైనా క్రమశిక్షణగా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
0 కామెంట్‌లు