ఢిల్లీ చీఫ్ సెక్రటరికీ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లేఖ
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందన..
నేటి కలం వార్త / తెలంగాణ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కి జిల్లాలో మర్యాద కరువైంది. ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని తీవ్ర అసంతృప్తి చెందిన వంశీ కృష్ణ మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి పంపారు.
ఈ లేఖలో ఎంపీ ప్రోటోకాల్ ఎందుకు పాటించబడటం లేదని ప్రశ్నిస్తూ ఉన్న అంశంపై సంబందిత అధికారులు వ్రాత పూర్వకమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ లేఖకు స్పందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గతంలో జరిగిన సంఘటనలను పునఃరాలోచించుకుని క్షమాపణ చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు జిల్లాలోని ఆయా విభాగాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
0 కామెంట్‌లు