రామగుండం~BPL~లో పుష్పా'3 కానీ ఇది కొంచెం అగ్గువా..

ఎవరీ భూములు.? ఎవరి బువ్వ.? 
ఎవరు తింటున్నారు.?



    1. నేటి కలం రామగుండం వార్త ;- సుమారు గత 27 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రామగుండం మండలం కేంద్రాన్ని అనుకుని అటు రైల్వే స్టేషన్ ఇటు మల్యాలపల్లి, బద్రిపల్లి గ్రామాలను కలుపుకుని ఉన్నటువంటి భూములను సాగు చేసే పంట పొలాలను ఇక్కడి గ్రామాల ప్రజలు రైతులు " BPL " అనే పేరుతో వచ్చిన ఓ పవర్ ప్లాంట్ యాజమాన్యానికి అప్పగిస్తే భవిష్యత్తులో వారి ఎదిగిన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని అమాయకంగా నమ్మి అప్పజెప్పారు. కానీ అటు ప్రజలు ఇటు రైతులు మరో వైపు నిరుద్యోగులు వీరెవరూ అనుకున్నది జరగకపోగా పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి భూములలో గత కొన్ని సంవత్సరాల నుండి వేలాది చెట్లు మొలిసి పెద పెద్ద వృక్షాలుగా పెరిగి దట్టమైన అడవిని తలపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కొందరు వేర్వేరు ముఠాలుగా ఏర్పడి పుష్ప సినిమాను తలపించేలా అందులో ఉన్న ఒక జాతికి రకమైన చెట్లను కోత మిషన్ల ద్వారా వారి ఇష్టానుసారంగా కోస్తూ వారికి కావలసిన పరిమాణంలో కట్ చేస్తూ ట్రాక్టర్ సహాయంతో వాటన్నిటికీ ఒక చోటికి తరలించి సాయంకాలం సమయం అయ్యేసరికి ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని యదేచ్చగా బయటపడుతున్నారు. అయితే ఈ కథనానికి పుష్ప సినిమా అనే పేరు ఎందుకు ప్రస్తావించి వచ్చిందంటే పుష్ప పార్ట్-1 లో సంబంధించిన ఎర్రచందనం స్మగ్లింగ్ దందాలో ఒక మహిళ కూడా కీలకపాత్ర పోషించింది. పార్ట్-2 లో కూడా అదే మహిళ అదే పాత్ర పోషించిందని సినిమా చూసిన వారందరికీ తెలుసు.. అదే విధంగా ఇక్కడ కూడా ఇద్దరు మహిళలు ఈ ముఠాతో చేతులు కలిపి ఈ తంతు కొనసాగిస్తున్నారనే సమాచారం.? ఈ నేపథ్యంలోనే ఈ కథనానికి పుష్ప-3 అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది.
    2. మొత్తం మీద ఎవరి భూములు.. ఎవరి బువ్వ.. ఎవరు తింటున్నారో.? మరి ప్రజలే.. రైతులే.. ఆలోచించాలి. ఆ ప్రాజెక్ట్ అధికారులే ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలి. ఎందుకంటే ఆ భూములను పవర్ ప్లాంట్ యజమానికి అప్పగించి 27 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భూమి పట్టాదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పుకోవచ్చు.? ఆ భూముల్లో ఎలాంటి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాకపోవడం అదే విధంగా ఆ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలిపోయిందని సమాచారం స్థానిక ప్రజలకు రైతులకు తెలిసినప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఏమి చేయలేని పరిస్థితి. ఒక ప్రాంతంలో ప్రాజెక్టుకి భూములను అప్పజెప్పిన తర్వాత ఒక నిర్ణీత సమయం కాలంలో ఆ ప్రాజెక్టు నిర్మించలేనట్టయితే.. ప్రాజెక్టు రానట్లయితే మళ్లీ తిరిగి ఆ భూములను రైతులే స్వాధీనం చేసుకుని సాగు చేసుకోవాల్సిన చట్టం ఉన్నప్పటికీ ఒక గొప్ప నిబద్ధత కలిగినటు వంటి రైతన్నలు ఆ భూములపై ఎలాంటి అజమాయిషీ లేకుండా సాగు చేసుకోవాలని ఎంతో ఆశగా ఉన్న మళ్ళీ తమ భూములు తమకి చెందాలని ఎదురు చూస్తున్నప్పటికీ ముందుకు అడుగు వేయలేని పరిస్థితి. కానీ ఇదే అదునుగా భావించిన కొందరి ముఠాలకు మాత్రం అదే భూముల్లో మొలిసి వెలిసి నటువంటి ఆ అడవి వాళ్లకి లక్షలలో కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు సెక్యూరిటీ వాళ్లు కూడా ఇప్పటికి విధులలో ఉన్నప్పటికీ అదే ప్రాజెక్టు నుంచి నెల నెల జీతభత్యాలు అందుతున్నప్పటికీ వారు ఎవ్వరు కూడా ఈ ముఠాను.. దందాను.. ఆపే పరిస్థితి లేకపోవడం కనిపించపోవడం ఇక్కడ గమన్హారం.

0 కామెంట్‌లు