రోడ్డుపైనే 20000 రూllలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం..
నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు
నేటి కలం నవంబర్ 25 వార్త ;- పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఉదయం ఎస్సారెస్పీ నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అందించిన వివరాల ప్రకారం కాంట్రాక్టర్ చేసిన ఓ పని నిమిత్తం బిల్లు ఎంబి రికార్డు చేయడం కోసం ఏఈ నర్సింగరావు లంచం డిమాండ్ చేయడంతో ఏం చేయాలో తోచక తమ్మడబోయిన శ్రీనివాస్ యాదవ్ అనే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రోడ్డుపైనే ఏఈ కి కాంట్రాక్టర్ తమ్మడబోయిన శ్రీనివాస్ యాదవ్ రూ;20,000/లు అందజేస్తున్న క్రమంలో అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి అవినీతి అధికారిపై దాడి చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా సదరు అధికారిని కలెక్టర్ కార్యాలయంలోకి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఆయన్ని విచారిస్తూ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.
0 కామెంట్‌లు