గోదావరిఖనిలో 130 ట్రాక్టర్ల అక్రమ ఇసుక..

ఇసుక డంపులను సీజ్‌ చేసిన రెవిన్యూ శాఖ..


 1టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి వెల్లడి. 

నేటి కలం వార్త  / రామగుండం : గోదావరిఖని సప్తగిరి కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 130 ట్రాక్టర్ ల ఇసుక డంపులను గుర్తించిన గోదావరిఖని వన్ టౌన్ పోకీసులు సీజ్ చేసిన రెవిన్యూ శాఖ అధికారులు.. వివరాల్లోకి  వెళితే గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సప్తగిరి కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక డంపు నిల్వ ఉంచిన విషయంపై గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రామగుండం తహసీల్దార్‌ కి చరవాణి ద్వారా సమాచారం అందించడంతో సంబంధిత ఆర్ఐ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురి శాఖల  సమక్షంలో అక్రమ ఇసుకను సీజ్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రజల ఇంటి కట్టడాలకు అవసరాలకు గోదావరి నుంచి ఇసుక తీసుకునేలా కల్పించిన వెసలుబాటును కొంత మంది అక్రమార్కులు వారి స్వలాభం కోసం దుర్వినియోగం చేస్తూ అధిక లాభం కోసం ఇసుక అక్రమంగా తరలించి డంపులుగా పోసి అక్రమార్జన చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది ఇది చట్టరీత్యా నేరం అని అక్రమంగా ఇసుక రవాణా నిలువ చేసే వాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. అదే విదంగా సిజ్ చేసిన అక్రమ ఇసుక పై ధర్యాప్తు చేయడం జరుగుతుందని తదుపరి విచారణ అనంతరం రెవెన్యూ శాఖ నిబంధనల ప్రకారం వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఖజానాకు పంపడం జరుగుతుందని సిఐ తెలిపారు.

0 కామెంట్‌లు