రామగుండం లింగాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు
నేటి కలం వార్త / పెద్దపల్లి జిల్లా : రామగుండం నియోజకవర్గంలోని లింగాపూర్ మోడల్ స్కూల్ (టీజీఎంఎస్) పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఐ.ఐ.ఐ.టి బాసర 2025 లో సీట్లు సాధించడం రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయంలో ఎంపిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందని లింగాపూర్ మోడల్ స్కూల్ (టీజీఎంఎస్) లింగాపూర్ ప్రిన్సిపాల్ పి.సదానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ.ఐ.ఐ.టి బాసరలో ప్రవేశం పొందిన విద్యార్థులలో పీ.శ్రీవల్లి, నిదా తస్నీమ్, కె.సరస్వతి, డి.లాస్య, ఎ.ప్రసూన లు ఉన్నారు. ఈ గొప్ప విజయం వారు అహర్నిశలు కష్టపడి చదివిన చదువు, తల్లిదండ్రుల సహాయ సహకారాలతో పాటు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధించిన విద్య వల్లనే సాధ్యమైందని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులకు టీజీఎంఎస్ లింగాపూర్ ప్రిన్సిపాల్ తోపాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. మునుముందు భవిష్యత్తు కాలంలో తమ విద్యార్థిని విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు అకాక్షించారు.
1 కామెంట్‌లు
మీ అందరికి శుభాకాంక్షలు మరియు మీరు జీవితంలొ ఉన్నత స్థానంలొ ఉండాలని కోరుకుంటున్నాను 💐
రిప్లయితొలగించండి