ఎల్బీ స్టేడియంలో జులై 4న, బహిరంగ సభ
ముఖ్యఅతిథిగా ఏ.ఐ.సి.సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ పిలుపు..
నేటి కలం వార్త హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జులై 4 శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర నలుమూలన ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వ సలహాదారు హార్కార వేణుగోపాల్ ఆహ్వానించారు.ఈ బహిరంగ సభలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న కీలకమైన కాంగ్రెస్ నేతలను నాయకులను ఉద్దేశించి ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్జె్ ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన సమిష్టి బలం ఐక్యతను ప్రదర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హార్కరా వేణుగోపాల్ రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు