రామగుండంలో మంత్రి వివేక్ సన్మాన సభ విజవంతం

    ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు..

  కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ గౌడ్


నేటి కలం వార్త / పెద్దపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన వివేక్ వెంకటస్వామి కి రాష్ట్ర క్యాబినెట్ లో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో కార్మికశాఖ మంత్రి పదవి చేపట్టిన తర్వాత మెదటిసారి రామగుండం నియోజకవర్గం గోదావరిఖనికి వచ్చిన సందర్బంగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున పుష్ప గుచ్చాలతో గజ మాలతో స్వాగతం పలికారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసి సన్మాన సభలో ఆయనను పూల మాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాగా ఈ సందర్భంగా సన్మాన సభకు హాజరై విజయవంతం చేసిన రామగుండం పట్టణం అంతర్గాం పాలకుర్తి మండలాల కాంగ్రెస్ నాయకులు అయన అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బందారపు మల్లికార్జున్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

0 కామెంట్‌లు