అధికార పార్టీ నాయకుల పరిస్థితే ఇలా ఉంటే.?
మరి ఇక సామాన్యుడి పరిస్థితి.?
నేటి కలం వార్త పెద్దపల్లి జిల్లా : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లలోని అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికార పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆరోపించారు. అభివృద్ధి పనుల కోసం టెండర్లు జరిగి నెలలు గడుస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని రామగుండం అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనునిత్యం కాళ్ల కు చక్రాలు కట్టుకొని టైం కు తిండి తిప్పలు లేకుండా హైద్రాబాద్ సెక్రటేరియట్ ఆపీస్ ల చుట్టూ ముఖ్యమంత్రి మంత్రుల చుట్టూ తిరుగుతూన్నారని ఎమ్మెల్యే పడుతున్న కష్టాన్ని గ్రహించిన, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ శ్రీ ఉదయం 9 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా ఆపీస్ లో ఉంటూ రామగుండం అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యాన్ని సిన్సియర్ గా నిర్వహిస్తుంటే అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టు కొంత మంది కింది స్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డివిజన్ లో టెండర్లు పూర్తయినా కూడా కాంట్రాక్టర్ లకు ఫోన్ చేసి ఫాలోప్ చేసి పనులు పూర్తి చేసేలా వారి కర్తవ్యాన్ని నిర్వహించడం లేదని సదరు అధికారులు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని రెండవ డివిజన్ లో మూడు పార్క్ లు పునరుద్ధరణ పనులకు టెండర్లు జరిగాయని సదరు కాంట్రాక్టర్ రెండు పార్క్ ల పనులు మొదలు పెట్టారు. ఇంకా ఒక పార్క్, కాంట్రాక్టర్ గానీ కార్పొరేషన్ అధికారులు గానీ కనీసం ఇప్పటి వరకు తొంగి చూసిన దాఖలాలు లేవు. అదేవిదంగా మూడు ఓపెన్ డ్రైనేజీ లకు టెండర్ లు జరిగాయవి ఇప్పటి వరకు ఆ పనులు మొదలు పెట్టలేదని ఇందిరమ్మ కాలని హనుమాన్ గుడి వెనుక మెయిన్ రోడ్డు టెండర్ జరిగి దాదాపు 3 నెలలు గడుస్తుందని అధికార పార్టీలో ఉన్న మేము వెంట పడుతున్న డివిజన్ అభివృద్ధి పనులు జరగడం లేదంటే మాలాంటి నాయకుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంట్టుందో అందరికి ఊహకే వదిలేస్తున్నానని వాళ్లు ఇంకా ఎవరికి ఏం పనులు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
0 కామెంట్‌లు