చిరుతల రామాయణం గురువుకు..
చివరి వీడ్కోలు పలికిన శిష్యులు..
నేటి కలం వార్త తెలంగాణ : పాడిన పాట మళ్ళీ మళ్ళీ పాడకుండా 48 గంటల పాటు అనర్గళంగా పాటలు పాడే ముసిపట్ల పుల్లయ్య ఇకలేరు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామానికి చెందిన చిరుతల రామాయణ గురువు ముసిపట్ల పుల్లయ్య లింగాపూర్ గ్రామంలో భారత స్వాతంత్రానికి ముందు జన్మించిన తన చిన్నతనం నుండే కళల మీద ఆసక్తితో కళా రంగం వైపు ప్రయాణించి భక్తి పాటలు భజన కీర్తనలు తోపాటు చిరుతల రామాయణం, కళా ఖండాలను నిర్మించి పదుల సంఖ్యలో రామాయణం కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే రామగుండం చుట్టూ పక్కల 10 గ్రామాలకు చిరుతల రామాయణాన్ని విస్తరింపజేశారు. ఇదిలా ఉండగా ఒకరోజు తన తోటి కళాకారులతో స్నేహితులతో అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు అనుబంధంగా ఉన్న గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం సన్నిధిలో సప్తహామీ భజనలో భాగంగా 7 రోజుల పాటు నిర్వహించే భజన కార్యక్రమంలో ఆపకుండా 48 గంటల పాటు పాడిన పాటే మళ్ళీ పడకుండా పాటలు పాడి తనతోటి కళాకారులను ఆశ్చర్యాచక్తులను చేసి మెప్పించిన ఘనత ఆయనకే దక్కింది. ఎంతో మంది కళాకారులను తయారుచేసి గాయకులుగా కవిగా గ్రామ పెద్దగా అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలో ఆయన దురదృష్టవశాత్తు శనివారం నాడు గుండె పోటుతో మరణించారు. ఆయన మరణ వార్త విన్న ఆయన శిష్యులు కళాకారులు అక్కడకు చేరుకొని తను లేని లోటు ఎవరు తీర్చలేరని తమ గురువు గారైన ముసిపట్ల పుల్లయ్య మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శిష్యులు తమ ఆట పాటలతో ఆయనకు ఘనంగా కన్నీటి అంతిమ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గంగారపు వెంకటేష్, నిమ్మరాజుల రవి, అర్చనపెళ్లి శ్రీనివాస్, కాసర్ల మల్లేష్, ఇరికిల్ల శంకర్, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో లింగాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
1 కామెంట్లు
ఓం శాంతి 🙏
రిప్లయితొలగించండి