గోదావరిఖని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పరిస్థితి.
నేటి కలం వార్త పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని ఆర్టీసీ డిపో పరిధిలో గల ఆర్టీసీ లెగిస్టిక్స్ (కార్గో) పార్సిల్ లో కటిక చీకటి నెలకొంది.
చీకటిలో ఉన్న పార్సిల్ కార్యాలయం
వివరాల్లో కి వెళితే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ఆర్టీసీ లెగిస్టిక్స్ కార్గో పార్సిల్ కార్యాలయంలో తేది: 26/6/2025 శుక్రవారం నాడు సాయంత్రం దాటి రాత్రి సుమారు 8 గంటల సమయం నుండి కరెంట్ లేక పోవడంతో పార్సిల్ కార్యాలయం కటిక చీకటిని అలుముకుంది. దింతో కంప్యూటర్ సిస్టమ్స్ పని చేయకపోవడంతో పార్సిల్ చేసుకోవడానికి.. తీసుకువడానికి.. వచ్చే కస్టమర్లకు నానా ఇబ్బందులకు గురయ్యారు. రాత్రివేళ కావడంతో ఆర్టీసీ కీ సంబందించిన ఎలక్ట్రిషన్ అందుబాటులో లేకపోవడంతో నిన్న రాత్రంతా పార్సల్ లో కరెంట్ కొరత ఏర్పడింది.
0 కామెంట్‌లు