శ్రీమతి కోరిక.. శ్రీవారి కానుక..

             పుట్టినరోజు పుణ్యకార్యం..


ఆవిడకు ఆయనే ప్రత్యక్ష దైవం..

నేటి కలం వార్త / తెలంగాణ :- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు ఏరియాలోని నివాసులు ప్రస్తుతం ప్రవృత్తి రీత్యా హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ కాలేజీలో అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న తోట పూర్ణ శేఖర్ గుప్తా తన శ్రీమతి తోట కవిత గుప్తా పుట్టినరోజు సందర్బంగా గోదావరిఖని పట్టణంలోని అమ్మ పరివార్ ఆశ్రమం వారు ప్రతి రోజు అన్నార్థులకు నిర్వహించే నిత్య అన్నదానం ద్వారా ఆకలితో అలమటించే యాచకులకు.. నిరాశ్రేయుల ఆకలి తీర్చడం ద్వారా వారి కళ్ళలో వచ్చే ఆనందం చూస్తే తన సతీమణి కూడా ఎంతో సంతోషిస్తుందని పుట్టినరోజు తను అడిగిన వెంటనే కాదనకుండా తన కళ్ళలో కూడా ఆ ఆనందం  చూడాలని శ్రీమతి కోరిక కు శ్రీవారు ఈ అద్భుతమైన కానుక కార్యచరణకు పునుకున్నాడు. ఈ సందర్బంగా ఆశ్రమం నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో తమ ఇండ్లలో జరిగే కొన్ని శుభాకార్యలకు ఇలాంటి సేవ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎంతో మానసిక ఆనందం కలగడమే కాకుండా మారేందరికో మార్గదర్శకాలుగా నిలుస్తారని అన్నారు. పూర్ణ శేఖర్ గుప్తా వారి సతీమణి శ్రీమతి కవిత గుప్తా ఇలాంటి పుట్టిన రోజులు ఆనందోత్సవాలతో మరెన్నో జరుపుకోవాలని వారి జీవితం అష్టశ్వర్యలతో.. ఆయురారోగ్యాలతో.. ఉండాలని ఆ దేవుడు ఆశీస్సులు వారి కుటుంబాకి ఎల్లవేళలా తోడుగా ఉండి సహాకారాలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అన్నదానానికి సహకరించిన పూర్ణ శేఖర్ గుప్తా కి అమ్మ పరివార్ ఆశ్రమం నిర్వాహకులు ఒక ప్రకటనలో అభినందించారు. అదేవిదంగా ఇంకా ఈ జన్మదిన సందర్బంగా తోట కవిత కు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లలో వారి అమ్మానాన్న.. అత్తమ్మ మామయ్య.. ఆడపడుచు అన్నయ్య.. అక్కలు బావలు వారి పిల్లలతో పాటు తనతో ఎన్టీపీసీ సెంట్రల్ హై స్కూల్ లో చదువుకున్న ఎస్.ఎస్.సి బ్యాచ్ స్నేహితులు.. స్నేహితురాళ్లు.. ఉన్నారు.

1 కామెంట్‌లు