గోదావరిఖని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ [AGP]

               ముస్కె రవికుమార్ యాదవ్..



నేటి కలం వార్త రామగుండం :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరిఖని సీనియర్ సివిల్ కోర్ట్ ఏ.జీ.పి గా రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుతం ఎన్టీపీసీ లో నివాసం ఉంటూ గోదావరిఖని కోర్ట్ లో విధులు నిర్వహిస్తున్న ముస్కె రవి కుమార్ యాదవ్ (ప్లీడర్) ని నియమించడం జరిగింది. నేటి నుండి అనగా జూన్ 30/06/2025 నుండి 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం తరుపున కోర్ట్ లో కేసులని వదిస్తారు. ఈ సందర్బంగా తన నియామకానికి కృషి చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్  ఠాకూర్ మరియు లీగల్ సెల్  చైర్మన్ కొప్పుల శంకర్ లకు రవికుమార్ కృతజ్ఞతలు తెలుపగా గోదావరిఖని బార్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

1 కామెంట్‌లు