అధికారులను అప్రమత్తం చేసిన అజ్ఞాతవాసి.?
నేటి కలం వార్త / పెద్దపల్లి ; బసంత నగర్ సమీపంలో అడవిలో అగ్ని అంటుకుని మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల పరిధిలో గల బసంత నగర్ సమీపంలో అడవిలో ఒక్కసారిగా అగ్ని అంటుకుని మంటలు చెలరే గాయి. రామగుండం నుండి పెద్దపల్లికి వెళుతున్న ఓ సామజిక స్పృహ కలిగిన అజ్ఞాతవాసి అటుగా వెళ్తుండడంతో ఒక్కసారిగా ఆడవిలో మంటలు చెలరేగడం గమనించాడు. వెంటనే ఆ అజ్ఞాతవాసి అటవీ శాఖ వాళ్ళతో పాటు అగ్ని మాపాక సిబ్బంది వారికి కూడా చరవాణి ద్వారా సమాచారం అందజేశాడు. సానుకూలంగా స్పందించిన అధికారులు తమ సిబ్బందిని పంపిస్తామని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయా శాఖల సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
1 కామెంట్లు
ఆ వ్యక్తి యొక్క సామజిక స్పృహ వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది
రిప్లయితొలగించండి