మరుపురాని.. మరువలేని.. మధుర క్షణాలు...

ఘనంగా 25వ, వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు..

సెంట్రల్ హైస్కూల్ ఎస్.ఎస్.సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నేటి కలం నవంబర్ 24 వార్త ; గత 25 సంవత్సరాల క్రితం ఓ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం రోజు సాయంత్రం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని విద్యార్థులంతా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయినా మాధరవేణ కొమురయ్య తో పాటు మిగతా ఉపాధ్యాయులను పుష్ప వర్షంతో స్వాగతిస్తూ సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 25 సంవత్సరాల క్రితం 1999-2000 సంవత్సర కాల సమయంలో గురువులు నేర్పిన పాఠాలతో నేడు వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరడానికి పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలే తమ భవిష్యత్తుకు బాసటగా నిలిచాయని కొనియాడారు. విద్యార్థులంతా ఒకరినొకరు కలుసుకొని భావోద్వేగంతో గత జ్ఞాపకాలను ఆనాటి మధుర క్షణాలను నెమరు వేసుకున్నారు. భవిష్యత్తులో ఎవరికి వారు ఏ స్థాయిలో ఎదిగి ఉన్న స్నేహం అనే మాటకు వచ్చేసరికి మేమంతా సమానులమే అనే నినాదాన్ని చాటి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేనాళను నిర్వహించుకుంటూ తమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ సమస్య వచ్చినా.. ఒకరికొకరు తోడు నీడై నిలవాలని వారంతా కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులంతా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వారి గౌరవ ప్రియ గురువులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రామకృష్ణ, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రాజు, ఆంగ్ల శాస్త్ర ఉపాధ్యాయులు ప్రకాష్, కిషన్, అశోక్, శ్రీధర్ తో పాటు పదవ తరగతి చదువుకున్న స్నేహితులు స్నేహితురాలు నాగమల్లేశ్వరి,  లక్ష్మీ శైలజ, బి.కవిత, దుర్గా, సిహెచ్.సుమలత, మంగ, శారద, జె.సరళ, వసంతలతో పాటు ఎస్.నగేష్, కే.శ్రీనివాస్, రవీందర్, పి.వంశీకృష్ణ, కే.కనక స్వామి, కే.మనోహర్, ఏ.నాగరాజు, ఏ మోహన్, బి.శ్రీనివాస్, పి.లక్ష్మీనారాయణ గౌడ్, ఓ.సతీష్,  పి.గురుమూర్తి, ఈ.వేణు, జి.సదానందం, టి.శ్రీనివాస్, సిహెచ్.వేణు, ఎన్.రాజేంద్రప్రసాద్, పి.తిరుపతి, జె.సతీష్, సంతోష్ రెడ్డి, ఏ.శ్యాంసుందర్, ఏ.తిరుపతి, సిహెచ్.గోపాల్, కమలాకర్, సురేష్, ఓ.సంపత్, తదితరులు పాల్గొన్నారు.

1 కామెంట్‌లు