రామగుండం పోలీస్ కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ..
రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ (ఐ.పి.ఎస్): ఐజి వెల్లడి.
నేటి కలం నవంబర్ 26 వార్త ;- రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో గల పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా గత 2021 సంవత్సరం నుండి 2024 వరకు వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన 521.544 కిలోల ప్రభుత్వ నిషేధిత గంజాయిని యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కొరకు శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని మంగళవారం రోజు నాడు కరీంనగర్ జిల్లా మానకొండూర్ వెంకటరమణ ఇన్సినేటర్ ఫ్యాక్టరీ వద్ద పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ రామగుండం కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారు 1,30,38,600/- రూపాయలు ఉంటుందని ఎండిపిఎస్ యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన కేసులలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమీషనర్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎం. శ్రీనివాస్ (ఐ.పి.ఎస్) ఐజి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు దురుద్దేశ్యంతో అక్రమార్జనలో భాగంగా అక్రమ గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని అన్నారు. ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం స్థానిక, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ కు కూడా అమలు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్, జైపూర్ ఎసిపి ఎ.వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ఏ.ఆర్ ఏసిపి సుందర్రావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్.ఐలు దామోదర్ మల్లేశం లు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు