ఇష్టారాజ్యాంగ మందు అమ్మకం

       మందు మత్తులో యువత జీవితాలు చిత్తు 


  ఆబ్కారీ అధికారుల తనిఖీలు.. అంతేగా అంతేగా?

నేటి కలం వార్త / రామగుండం తెలంగాణ : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ గోదావరిఖని పట్టణాలలో కొందరు మందు షాప్ ల యజమానులు ఇష్టా రాజ్యాంగ మందు అమ్ముతున్నారు. రాత్రి వేళలో యువతను మందకు బానిస అయ్యేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ప్రభుత్వం జారీ చేసే షరతులు ఆబ్కారి అధికారుల నిబంధనలు వారికీ ఏ మాత్రం పనికి రాని పాఠాలుగా విని వినినట్టుగా వాటిని తుంగలో తొక్కుతూ మందు అమ్ముకుంటున్నారు. ఆబ్కారి అధికారుల మాట పక్కన పెడితే రాత్రి వేళల్లో 10 దాటాక ఏ దుకాణం అయిన బంద్ చేయాల్సినదేనని నిర్ధిష్టమైన సమయ సూచనలు ఉన్నప్పటికీ వాటిని ఆ టైం ప్రకారం బంద్ చేస్తున్నారా లేదా అని ప్రతి రోజు పోలీస్ లు తమ వీధిలో భాగంగా పెట్రోలింగ్ చేస్తూ గమనిస్తూ ఒకవేళ ఎవరైనా యజమాని షాప్ బంద్ చేయకుంటే హెచ్చరికలు జారీ చేస్తూ షాప్ లు బంద్ చేపించాల్సి ఉన్నప్పటికీ స్థానిక పోలీస్ లు కూడా వీటి పైన దృష్టి పెట్టకుండా షాప్ యజమానులు వాళ్ళ పబ్బం గడుపుకున్నాక మెల్లగా వచ్చి పోలీస్ వాహనంతో సైరన్ వేస్తూ తూ.. తూ.. మంత్రంగా చెక్కర్లు కొడుతూ వెళ్లిపోతున్నారు. ఎన్నోసార్లు ఎంతో మంది విలేఖరులు ఎన్నో పత్రికల ద్వారా వార్తలు ప్రచురించిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడం ఇటు పత్రిక మీడియా వర్గాల్లోను అటు సమాజంలోనూ ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. బాధ్యత కలిగి ప్రభుత్వం ద్వారా జీతాలు పొందే అధికారులు స్థానిక యువత ప్రజలు మందుకు బానిసలై తమ జీవితాలను కోల్పోయి మరి కొందరు ప్రాణాలను కోల్పోతూ ఉంటే అదే ప్రజలు కొనే ప్రతి వస్తువు ద్వారా ఇన్కమ్టాక్సీల ద్వారా చెల్లించే ప్రజా ధనాన్ని వాళ్ళు ఏం పని చేస్తున్నారని జీతాలుగా తీసుకుంటున్నారనే ప్రశ్నలు కూడా వెళ్ళువెత్తుతున్నాయి. ఇక అధికారులు పర్యవేక్షించాలి. చర్యలు తీసుకోవాలనే మాటలు అనుకోవడం అందరి మూర్ఖత్వం. జై హింద్.. జై భారత్...

0 కామెంట్‌లు