బంగారు దొంగలను తపించారా? తపించుకున్నారా?
నేటి కలం వార్త తెలంగాణ : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వృద్ధురాలి పుస్తెల తాడు (రెండు తులాలు) తో పాటు తన రెండు పుస్తెలు (అర్థ తులం) చోరీకి గురైయ్యాయి. వీటి విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని అంచనా...
ఇక వివరాల్లోకి వెళితే అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామపంచాయతీ పరిధి బద్రిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాసరి రాజవ్వ కు ఒంట్లో షుగర్ అమాంతం పెరిగి కొంత అస్వస్థకు గురికావడంతో నాలుగు రోజుల క్రితం గోదావరిఖని పట్టణంలో గల రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లడంతో అక్కడి వ్యైద సిబ్బంది వృద్ధురాలుకు కొన్ని పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం ఒక స్టాఫ్ నర్స్ మరొక నర్సింగ్ స్టూడెంట్ ఇద్దరు కలిసి రాజవ్వకు ఈసీజీ చేయాలనే నెపంతో వార్డులోకి వచ్చి పేషంట్ దగ్గర ఎవ్వరూ ఉండవద్దని హుకుం జారిచేశారు. దింతో తన కొడుకులు అక్కడినుండి వెళ్ళిపోగా తన కూతురు అయిన తిరుపతమ్మ అక్కడే ఉండటంతో తనను కూడా వెళ్లాలని పెషేంట్ పక్కన ఎవరు ఉండరాదని సదరు సిబ్బంది అనడంతో రాజవ్వ కూతురు మా అమ్మ కు తోడుగా ఉంటానని మీరు చేయాల్సిన పరీక్షలు చేసుకొమ్మని చెప్పినప్పటి వాళ్ళు తనదైన స్టైల్ లో లేదు.. లేదు.. ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని ఆదేశించారు. దింతో చేసేదేమి లేక సదరు మహిళా అక్కడినుండి వెళ్ళిపోయింది. రాజవ్వ ఆ సమయంలో మతిస్థిమితం లోకపోవడంతో అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బంది సుమారు 10 నుండి 15 నిముషాల సమయం గడిసిన తర్వాత గబ గబ వెళ్లిపోతున్నారని గమనించిన రాజవ్వ కూతురు తిరుమల తన తల్లీ వద్దకు చేరుకుని తన తల్లీ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను సరిచేస్తున్న క్రమంలో తన తల్లీ మెడలో ఉన్న బంగారు పుస్తళతాడు పుస్తెలు కనిపించడం లేదని వాటిని ఎవరో దొంగలించారని గ్రహించి అప్పుడే అక్కడినుండి తొందర తొందరపాటుగా వెళ్లిన ఆసుపత్రి సిబ్బంది ఫై అనుమానం వచ్చి వెళ్లి అడగగా మేము నీ కంటికి ఎలా కనిపిస్తున్నామని దబాయింపుతోపాటు మేము ఎవరమనుకుంటున్నావు ప్రభుత్వ ఉద్యోగులం అని బదులిస్తూ బుకయించే ప్రయత్నం చేశారు.
దింతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో తన తమ్ముళ్లను పిలిచి విషయం చెప్పి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని చెప్పడంతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేయగా ఫిర్యాదు స్వీకరించిన సదరు ఓ అధికారి ఒక పోలీస్ కానిస్టేబుల్ ను ఆసుపత్రి కి పంపించి విచారణ చేయమని పంపించారు. అక్కడకు వచ్చిన సదరు కానిస్టేబుల్ తూ.. తూ.. మంత్రంగానే విచారణ జరిపాడని భావించిన బాధితురాలు సోదరులు వాళ్ళ ఊరు గ్రామ సర్పంచ్ కు చరవాణి ద్వారా సమాచారం తెలిపారు. దాంతో గ్రామ సర్పంచ్ రంగంలోకి దిగి ఆసుపత్రి వద్దకు చేరుకుని దొంగతనంకు సంబందించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఉన్నతాధికారిని కలిసి జరిగిన సంఘటనకు సంబందించిన వివరాలను చెప్పాడు. సర్పంచ్ జోక్యంతో సదరు ఉన్నత అధికారి ఇది వరకు ఫిర్యాదు తీసుకున్న అధికారిని పిలిపించి మందలించినట్టుగా తెలుస్తుంది. ఇది చిన్న నేరం కాదు మీరు ఇలా చేయడం ఏం బాగులేదని వెంటనే ఒక అధికారిని పంపించి విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. దింతో కేసు విచారణ శులభతరైమయింది. సదరు అధికారి ఆసుపత్రికి చేరుకుని రాజవ్వకు ఈసీజ్ చేసిన సిబ్బందితో పాటు ఆసుపత్రి సిబ్బందిని వార్డులో చుట్టుప్రక్కల ఉన్న వారందరిని విచారించి దొంగలు ఎవరైనా ఉపేక్షించేది లేదని చెప్పి విచారణ కొనసాగించారు. దింతో మరుసటి రోజు రాజవ్వ మెడలో దొంగలించబడిన పుస్తెల తాడు రెండు పుస్తెలు తను ఉన్నటువంటి వార్డులోనే ఒక మూలన ఉన్న డబ్బాలో పడవేసినట్టుగా గుర్తించినట్టు పోలీసులు ఆసుపత్రి సిబ్బంది చెప్పే మాట. దొంగలు చాలా చక్కచక్యంగా నగలను అక్కడ పడేసి తప్పించుకున్నారా? లేక ఎవరైనా వాళ్ళని కావాలని తప్పించారా? రాజవ్వ కొడుకులను పిలిపించి ఆ డబ్బాలో ఉన్న బంగారు నగలను మీదొకాదో గుర్తించాలని అడగగా ఆ బంగారు పుస్తెల తాడు పుస్తెలు మా అమ్మవేనని నిర్దారించారు. దింతో పోలీసులు ఆ బంగారు నగలను పోలీస్ స్టేషన్ కి తరలించి రాజవ్వ కొడుకులను బిడ్డను ఉన్నతధికారి వద్దకు వచ్చి నగలను రికవరీ చేసుకోవాలిందిగా తెలిపి అక్కడినుండి వెళ్ళిపోయారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు దొంగలు ఎవరో పోలీసులు నిజం నిగ్గు తేల్చాల్సి ఉంది.

0 కామెంట్లు