నాన్నల దినోత్సవం నాడు ఓ నాన్నకి శోకసంద్రం

         కారణం ఏదైనా కన్న తల్లే కాల యముడైంది.


నేటి కలం వార్త తెలంగాణ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ తల్లి... ఇద్దరు కొడుకులు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం (త్రీ) 3 టౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్ (వయసు 7 సంllలు ), తనిష్క్ (వయసు 5 సంllలు) లతో కలిసి నివాసం ఉంటున్న లింగరాజు, స్వాతి దంపతులు వారు కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ ఇద్దరు పిల్లలకు ఎలుకల మందును తినిపించి, తాను కూడా తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మరణించగా స్వాతి ఆరోగ్యం విషమంగా ఉండగా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

0 కామెంట్‌లు