ముగ్గురు ఐ.పి.ఎస్ ల పోస్టింగ్'లు ఊస్టింగ్.?

    తమిళనాడులో మైనర్ బాలిక హ..త్యా..చారం..

     

    కేసు విచారణ పై ముగ్గురు ఐ.పి.ఎస్'ల జోకులు..

    తమిళనాడు సీఎం విజయ దళపతి కీలక నిర్ణయం 

నేటి కలం వార్త తెలంగాణ : దేశ రాజకీయాలు మొత్తం తమిళనాడు వైపే చూస్తున్న వేళ ఆ రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోర హ..త్యాచారం జరిగింది. ఆమెను కొంత మంది వ్యక్తులు అపహరించి అత్యంత కృరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాష్ట్ర సీఎం విజయ్ వెంటనే స్పందించారు. అంతే కాకుండా జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించిన విషయాలను వెల్లడించాడానికి నిన్న ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐ.పీ.ఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ మహిళ ఐజీ అధికారి వ్యవహరించిన తిరుపట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. 

   ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా.. నీకు కూడా పెళ్లయి ఉంటుంది కదా.. నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా.. ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించిన సీఎం ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబు దారీగా ఉండాలని.. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏ మాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు. విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ ని చూసి మిగతా ముఖ్యమంత్రులు నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.. విజయ్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. ఆ ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయించాడు. దీనిని బట్టి పోలీసులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుంటారని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులను వ్యాఖ్యానిస్తున్నారు. వైరల్ చేస్తున్నారు.

0 కామెంట్‌లు